Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఈ నెల 21 నుంచి రీ సర్వే ప్రారంభం: ‌జ‌గ‌న్

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:07 IST)
భూముల రీసర్వే ప్ర‌క్రియ విష‌యంలో ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి సమగ్ర సర్వే చేస్తున్నాయ‌ని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అని ఏపి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.

‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం’పై సర్వే ఆఫ్‌ ఇండియాతో ప్ర‌భుత్వం అవగాహన ఒప్పందం కుద‌ర్చుకున్న అనంత‌రం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు.

"దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే చేస్తున్నాం. ఇంటి స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, మరో స్తిరాస్థి కానివ్వండి.. దానిమీద ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతాం. ఆ టైటిల్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరుతున్నాం. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుంది.

ఆ మేరకు టైటిల్‌ ఖరారు చేస్తారు. ఆ తర్వాత  కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుంది. అనంత‌రం ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుంది. 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. 100 ఏళ్లలో సబ్‌ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి.

వాటన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తాం, రాళ్లు కూడా వేస్తాం. తర్వాత యూనిక్‌ ఐడెంటింటీ నంబర్‌తో కార్డు కూడా ఇస్తాం. ఆ కార్డులో క్యూర్‌ఆర్‌ కోడ్ ‌ఉంటుంది, హార్డ్‌కాపీ కూడా ఇస్తారు. ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతాం.

రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్‌ చేస్తాం. విలేజ్‌ హాబిటేషన్స్‌కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయ‌ని" తెలిపారు. భూముల రీసర్వే కచ్చితత్వంతో పూర్తి చేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ అన్నారు. మొదటి దశలో భాగంగా ఈ నెల 21న రీసర్వే ప్రారంభవుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

మెగాస్టార్ చిరంజీవి గారి ప్రోత్సాహంతో డ్రింకర్ సాయి అప్రిషియేషన్ : నిర్మాత బసవరాజు

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments