Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కంటే ‘నారా వైరస్‌’ డేంజర్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (06:41 IST)
టీడీపీ నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘నారా వైరస్’ కరోనా కంటే భయంకరమైనది. కరోనాకు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా రాష్ట్ర ప్రజలు మాత్రం నారా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు. ఆ వ్యాక్సిన్‌తోనే పది నెలల క్రితం వైరస్‌ను తరిమికొట్టారు.

మళ్లీ వ్యాప్తి చెందేందుకు అబ్బా కొడుకులు, కుల మీడియా కిందా మీదా పడుతోంది’ అని ట్వీట్‌ చేశారు. అలాగే ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నేరంగా పరిగణిస్తే తామసలు ఎన్నికల్లోనే పోటీ చేయమని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నాడు.

ఇది చంద్రబాబు చెప్పించిందే. కోర్టుల్లో కేసులు ఎవరితో వేయించాలి. ఏమాట ఎవరితో అనిపించాలనే స్కెచ్ వేయడంలో బాబును మించినోళ్లేవరూ లేరు’ అని విజయసాయి మండిపడ్డారు.

‘రెండేళ్ల క్రితమే స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసినా, ఓటమి భయంతో చంద్రబాబు ఎన్నికలు నిర్వహించలేదు. ఫలితంగా రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం ఏర్పడింది.

రిజర్వేషన్లపై కోర్టుకెళ్లి బీసీలకు ద్రోహం చేయడమే కాక నిధుల రాకను కూడా అడ్డుకుంటున్నారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments