ఇరాన్ ప్రభుత్వం అంగీకరించిన పక్షంలో ఆ దేశంలో కూడా కరోనా వైరస్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు.
దీనివల్ల ఇరాన్‌లో ఉన్న భారతీయులను వైద్య పరీక్షల అనంతరం ఇక్కడకు తీసుకు రావడానికి ఆస్కారముంటుందని ఆయన చెప్పారు.
ఢిల్లి ఆరోగ్యమంత్రిని, మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులను తాను కలిశానని ఆయన చెప్పారు. ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులను పెంచాలని కోరినట్లు ఆయన చెప్పారు.
చైనా టెకీ కోసం గాలింపు
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం మండలం నెరబైలుకు చెందిన ఒక వ్యక్తికోసం అధికారులు గాలిస్తున్నారు. గ్రామానికి చెందిన కుండ్ల గిరిధర్ చైనాలో ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
గత నెల 25న మన దేశానికి తిరిగివచ్చిన ఆయన బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగాక కన్పించకుండా పోయారు. ఈ విషయం తెలియడంతో వైద్యశాఖ అధికారులు ఆయనకోసం గ్రామంలో విచారించారు.