Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఇల్లు కూల్చేశారు

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (11:01 IST)
ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఓ ప్రేమ జంట శుక్రవారం పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె, ఆమె భర్తపై బంధువులు దాడిచేసి ఇల్లు కూల్చి వేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉప్పలూరు గ్రామంలో జరిగింది.
 
ఉప్పలూరు గ్రామానికి చెందిన కలపాల రాజ్‌కుమార్‌, కొండ్రు మౌనిక ఒకే ప్రాంతంలో నివాసముంటున్నారు. రాజ్‌కుమార్‌ గన్నవరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. మౌనిక భీమవరంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వీరిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. మేజర్లయిన వీరిద్దరూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని  వేలంగిణిమాత ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం సమాచారం తెలుసుకున్న మౌనిక బంధువులు రాజ్‌కుమార్‌ ఇంటిని ధ్వంసం చేశారు. అతని తల్లిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రేమ జంట రక్షణ కల్పించాలని కోరుతూ కంకిపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments