Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైభ‌వంగా శాకాంబ‌రి దేవి ఉత్స‌వాలు

Webdunia
శనివారం, 4 జులై 2020 (22:00 IST)
ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌రస్వామి వార్ల దేవస్థానంలో శాకాంబ‌రి దేవి ఉత్స‌వాలు రెండో రోజైన శ‌నివారం నాడు కూడా వైభ‌వంగా జ‌రిగాయి.

ఆల‌య అర్చ‌కులు, వేద‌పండితులు సేవా కార్య‌క్ర‌మాలు, పూజాధికాల‌ను శాస్త్రోక్తకంగా నిర్వ‌హించారు. ప‌లువురు భ‌క్తులు అమ్మ‌వారికి ఆషాడ మాసం సంద‌ర్భంగా ప‌విత్ర సారెను తీసుకువ‌చ్చి అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.

కేశ‌ఖండ‌న‌శాల‌లో ప‌లువురు భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కుబ‌డులు చెల్లించారు. కోవిడ్‌-19 నేప‌ధ్యంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు న‌డుమ మాస్కులు ధరించి ఆన్‌లైన్‌లో టైం స్లాట్ పద్దతి ద్వారా టికెట్లు పొంది‌ అమ్మవారిని  దర్శించుకున్నారు.

ఆల‌య ఈవో ఎంవీ సురేష్‌బాబు ఉత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. శాకంభరీ దేవి ఉత్సవాల సందర్భముగా అమ్మవారు వివిధ కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరింపబడి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

దేవస్థానం నందు గర్భాలయం, అంతరాలయం, ప్రధానాలయం ప‌రిస‌రాల‌ను వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు. శాకంబ‌రీ ఉత్సవాల సందర్భంగా భక్తులందరికీ కదంబం ప్రసాదంగా అంద‌జేశారు. శాకాంబ‌రి దేవి ఉత్స‌వాలు ఆదివారంతో ముగియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments