Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతంలో కోత సామాజిక బాధ్యత: గవర్నర్

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:35 IST)
కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని పిలుపును అందుకున్న మరుక్షణమే తన జీతంలో సంవత్సరం పాటు ముఫై శాతం కోతకు స్వఛ్ఛందంగా ముందుకు వచ్చారు.

ఈ మేరకు గవర్నర్ స్వయంగా మంగళవారం రాష్ట్రపతికి అంగీకార లేఖను రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపడుతూ వస్తొంది.

ఈ క్రమంలోనే ఆర్ధికపరమైన వెసులుబాటు కోసం పలు కార్యక్రమంలు తీసుకుంటుండగా, ప్రధాని మోది సోమవారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

పార్లమెంటు సభ్యుల నిధుల రద్దు, వారి జీతాలలో కోత వంటి వాటితో పాటు, రాజ్యాంగ అధినేతలుగా ఉన్న రాష్ట్ర పతి, ఉప రాష్ట్ర పతి, గవర్నర్లు స్వఛ్ఛంధంగా జీతాల కోతకు ముందుకు వస్తున్నారని ప్రకటించారు.

ఈ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ తన జీతం నుండి ప్రతి నెల 30 శాతం  నిధులను మినహాయించి కరోనా కట్టడికి వ్యయం చేయాలంటూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు లేఖ రాశారు.

గవర్నర్ అదేశాల మేరకు రాజ్‌భవన్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments