Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో చొరబడిన ఉగ్రవాదులు... హైఅలెర్ట్?

Webdunia
బుధవారం, 22 మే 2019 (13:11 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల్లో పోలీసులు గస్తీని ముమ్మరంచేశారు. అలాగే, హోటళ్లు, లాడ్జీల్లో కొత్తవారు దిగితే వెంటనే సమాచారం అందించాలని యాజమాన్యాలను ఆదేశించారు. 
 
అలాగే నగరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా నౌకాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పన్నపూడి పాతవూరు సమీపంలో మత్స్యకారులకు అనుమానాస్పద పడవ ఒకటి లభ్యమైంది. 
 
ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడి 258 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్‌లోకి ప్రత్యేక బోట్ ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర వర్గాలు కోస్తాతీర రాష్ట్రాల పోలీసులను హెచ్చరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments