Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నరు త‌మిళిసై కు స్వ‌రూపానందేంద్ర ఆశీస్సులు

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (17:11 IST)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను సందర్శించారు. హైద‌రాబాదులోని 
చందా నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవాల‌కు ఆమె హాజరై స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. 
 
తెలంగాణ గవర్నరుకు స్వరూపానందేంద్ర స్వామి జగద్గురు ఆదిశంకరాచార్య ప్రతిమను బహూకరించారు. గవర్నరు నుదుట తిలకం దిద్ది రాజశ్యామల అమ్మవారి రక్షా రేఖను కట్టారు.  ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములను కలిసి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.

లోక కళ్యాణార్దం ఆధ్యాత్మిక మార్గంలో విశాఖ శారదా పీఠాధిపతులు చేపడుతున్న కృషి అభినందనీయమని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలందరినీ బయటపడేయాలని స్వామీజీని కోరుకున్నట్లు గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. చందానగర్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు శోభాయమానంగా ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments