Webdunia - Bharat's app for daily news and videos

Install App

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

సెల్వి
మంగళవారం, 3 జూన్ 2025 (10:26 IST)
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నగరం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ ఇప్పటికీ తెలంగాణ వెనుకబడి వుందని తెలిపారు. 
 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈటెల మాట్లాడుతూ, తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎత్తి చూపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ వేగవంతమైన అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. 
 
కేవలం 11 నెలల్లో, ఏపీ రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దాదాపు 7 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. అమరావతి రాజధాని పనులను చంద్రకబాబు ఎలా అత్యవసరంగా పునఃప్రారంభించారో, రాష్ట్ర ప్రతిష్టను త్వరగా మార్చారని కూడా ఈటెల హైలైట్ చేశారు. 
 
మరోవైపు, తమ పాలనలో తెలంగాణలో ఫలితాలను అందించడంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరినొకరు నిందించుకునే బదులు నిజమైన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. తెలంగాణ తన వనరులను తెలివిగా ఉపయోగించుకుని, రాజకీయ పోటీలను పక్కన పెడితే వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments