Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ చెప్పుకుంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సంబరాలు చేసుకుంటున్నారు. తాము పని చేసే ప్రాంతంలో చంద్రబాబు పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ డ్యాన్స్‌ను వీడియో తీసిన ఇతరులు.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలంగాణాలో ఒక గ్రామంలో ఉపాధి హామీ పని చూసుకుంటూ ఆనందంతో చంద్రబాబు పాట మీద డ్యాన్స్ చూస్తూ ఆనందం వ్యక్తపరిచారు. ఇపుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. 
 
కాగా, ఈ నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార వైకాపా ఒంటరిగా పోటీ చేయగా, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఒక కూటమిగా పోటీ చేశాయి. ప్రస్తుతం వస్తున్న అంచనాల మేరకు.. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో టీడీపీ - జనసేన - బీజేపీ కూటిమి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తూ, భారీగా బెట్టంగులకు పాల్పడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments