Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి... చిట్టెలుకతో గుత్తొంకాయ కూర... (Video)

మధ్యాహ్నమైతే చాలు... కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటాం. అంటే.. నిజంగా ఎలుకలు పరిగెత్తవు. బాగా ఆకలి అవుతుందన్నదానికి సంకేతం. ఏదేని పనిమీద బయటిఊర్లకు వెళితే హోటల్‌కెళ్లి భోజనం చేస్తాం. అలా వరంగల్ అర

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (08:12 IST)
మధ్యాహ్నమైతే చాలు... కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటాం. అంటే.. నిజంగా ఎలుకలు పరిగెత్తవు. బాగా ఆకలి అవుతుందన్నదానికి సంకేతం. ఏదేని పనిమీద బయటిఊర్లకు వెళితే హోటల్‌కెళ్లి భోజనం చేస్తాం. అలా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సుబేదారిలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు ఓ వ్యక్తి. భోజనం ఆర్డర్ చేశాడు.
 
కూరల్లో గుత్తివంకాయ కూడా ఉంది. నిగనిగలాడుతూ.. ఘుమఘుమలాడుతోంది. ఆవురావురు అంటూ ఓ వంకాయను నోట్లో పెట్టుకున్నాడు. అంతే షాక్ అయ్యాడు.. అది గుత్తొంకాయ కాదు.. ఎలుక.. చిన్న చిట్టెలుక. ఇంకేమైనా ఉందా.. ఒళ్లు వణికింది.. గుండె దడ పెరిగింది.. ఆ ఎలుకను అలాగే పట్టుకుని హోటల్ నిర్వాహకులకు చూపించాడు.. బయటకు వచ్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌‌కి చెందిన రమేశ్‌ భార్య హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఆమెకు భోజనం తీసుకెళ్లేందుకు హోటల్‌కు వెళ్లి ఆర్డర్ ఇచ్చారు. ఇంతలో తనకూ ఆకలి కావడంతో తాను కూడా భోజనం చేసేందుకు కూర్చొన్నాడు. 
 
ఈ క్రమంలో గుత్తొంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షమైంది. వంకాయ ముక్క అని భావించి నోట్లో పెట్టుకున్న క్రమంలో ఎలుకను గుర్తించాడు. ఈ క్రమంలో ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అనంతరం హోటల్‌ యాజమాన్యం నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments