Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు బద్ధశత్రువులు.. నేడు బెస్ట్ ఫ్రెండ్స్ : కేసీఆర్‌తో పయ్యావుల ఏకాంత చర్చలు!

తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్య

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (18:16 IST)
తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అనేక రకాలైన విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు దీంతో వారిద్దరి మధ్య వైరానికి దారితీశాయి కూడా. ముఖ్యంగా రాష్ట్ర విభజనను పయ్యావుల తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతపురం వేదికగా చేసుకుని విద్యార్థులతో ఉద్యమం కూడా నడిపారు. దీంతో కేసీఆర్, పయ్యావులలు బద్ధశత్రువులుగా మారారు. 
 
అయితే, అదంతా గతం. రాష్ట్ర విభజన జరిగిపోయి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆదివారం అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 
 
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఈ వివాహా వేడుకకు హాజరైన కేసీఆర్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌తో కొంచెం సేపు మాట్లాడినట్టు సమాచారం. ఐదారు నిమిషాల పాటు ఆయనతో కేసీఆర్ ఏకాంతంగా సంభాషించారని, ముఖ్యంగా, ఏపీ రాజకీయాలపై, ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలపైనా ఆరా తీశారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల గురించీ పయ్యావులతో కేసీఆర్ మాట్లాడినట్టు వినికిడి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments