Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో వివాహేతర బంధం ... 13 యేళ్ల బాలికతో 37 యేళ్ల వ్యక్తి పెళ్లి

Webdunia
మంగళవారం, 19 మే 2020 (14:50 IST)
భార్య చనిపోయి ఇద్దరు పిల్లలున్న ఓ కామాంధుడు... ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె 13 యేళ్ల కుమార్తెపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ వేశాడు. అంతే.. ఆ బాలిక తల్లితో ఉన్న చనువుతో పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేశాడు. డబ్బు ఆశ చూపాడు. ఆ మహిళ కూడా 37 యేళ్ళ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సమ్మతించింది. దీంతో 13 యేళ్ల బాలికను బలవంతంగా తీసుకెళ్లి, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఆ బాలికను రక్షించారు. పరారీలో ఉన్న 37 యేళ్ళ కామాంధుడుకి కోసం గాలిస్తున్నారు. 
 
ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా ఫరూక్‌ నగర్‌ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ అనే 37 యేళ్ళ వ్యక్తి షాద్‌నగర్‌లోని ఓ మద్యం దుకాణంలో పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు. అయితే, కొన్ని నెలల క్రితం భార్య చనిపోయింది. 
 
ఈ క్రమంలో తాను నివసించే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడి, అది చనువుగా మారింది. అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే, ఆ మహిళకు 13 యేళ్ల కుమార్తె ఉంది. ఆ బాలికపై మల్లేశం కన్నుపడింది. నిజానికి ఈ బాలిక మల్లేశం కుమార్తె కుంటే ఐదేళ్లు మాత్రమే పెద్ద. అయినాసరే, ఆ బాలికను పెళ్లి చేసుకుని భార్య చేసుకోవాలని ప్లాన్ వేశాడు.
 
బాలిక తల్లితో ఉన్న చనువు కారణంగా పెళ్లి ప్రతిపాదన తెచ్చి... ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి వారు కూడా లొంగడంతో ఈ నెల 15వ తేదీన బాలికను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. 
 
తాజాగా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు, ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని బాలిక, ఆమె కుటుం సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం బాలిక ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. విషయం తెలిసి పరారైన మల్లేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments