Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదని కూరలు తరిగే కత్తితో నరికేశాడు... యువతి ప్రాణం తీసిన ఉన్మాది

ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి తలను నరికేశాడు. కూరగాయలు కోసే కత్తితో ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో జరిగింది. ఈ వివ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (10:32 IST)
ఉన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని ఓ యువతి తలను నరికేశాడు. కూరగాయలు కోసే కత్తితో ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన తారకేశ్వరరావు అనే వ్యక్తి 20 యేళ్ళ క్రితం కుటుంబంతో కలిసి ఉపాధి కోసం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం వచ్చారు. ఇక్కడే వినాయకనగర్‌లో ఉంటూ స్థానిక పరిశ్రమలో పనిచేస్తున్నారు. వీరి ఇంటికి ఎదురుగా మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం నివాసముంటోంది. 
 
తారకేశ్వరరావుకు నికిత అనే 17 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. ఇంటికి ఎదురుగా ఉన్న మహారాష్ట్ర కుటుంబానికి చెందిన ఓ యువకుడు నికితను గత రెండేళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే, అతని ప్రేమను నికిత తిరస్కరించింది. 
 
ఈనేపథ్యంలో గురువారం సాయంత్రం నికిత స్కూల్‌ నుంచి రాగానే.. సోను ఇంట్లోకి చొరబడి కూరగాయలు తరిగే కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా.. బయటికి వచ్చిన సోను తీరిగ్గా ఇంటి బయట కూర్చున్నాడు. 
 
ఇంట్లో జరిగిన ఘోరాన్ని చూసి బెదిరిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు... రక్తపు మడుగులో పడివున్న నికితను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments