Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం నుండి డబ్బులు డ్రా... రూ.2000 నోట్లు చూసి షాక్‌

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (19:20 IST)
ఈమధ్య కాలంలో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే యూజర్లు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి కారణం... చిరిగిపోయిన కరెన్సీ నోట్లు వస్తుండటమే. ఇలాంటిదే జరిగింది. ఏటీఎం నుండి నగదు డ్రా చేసిన వ్యక్తి డబ్బులను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. డ్రా చేసిన సొమ్ములో చిరిగిన నోట్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ ఘటన విజయవాడలోని మైలవరంలో వెలుగుచూసింది.
 
మద్దాలి గణేష్ అనే వ్యక్తి నారాయణ థియేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.30 వేలు డ్రా చేశాడు. అందులో 10 రెండు వేల రూపాయల నోట్లు చిరిగినవి వచ్చాయి. చిరిగిన నోట్ల విలువ రూ 20 వేలు ఉండడంతో అతను ఒక్కసారిగా విస్మయం చెందాడు.
 
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను మోసం చేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలువురికి ఏటీఎంలో చిరిగిన నోట్లు దర్శనమిచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది వరకు కూడా అనేక మార్లు చిరిగిన నోట్లను ఏటీఎంలో పెట్టారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments