Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాకు రాజీనామా చేస్తున్నా... నన్ను కరివేపాకులా... సీతారత్నకుమారి

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్నకుమారి టీడీపికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. లేఖలో ఆమె వెల్లడించిన వివరాలు.... ''తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధపడుతున్నాను. టీడీపి అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి..

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (16:29 IST)
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నిమ్మగడ్డ సీతారత్నకుమారి టీడీపికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. లేఖలో ఆమె వెల్లడించిన వివరాలు.... ''తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధపడుతున్నాను. టీడీపి అధికారం కోల్పోయిన దగ్గర్నుంచి... అంటే, 2004 నుంచి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. పార్టీ బాగు కోసం నిస్వార్థంగా పనిచేశాను. చిన్నప్పట్నుంచి తెలుగుదేశం పార్టీపై వున్న అభిమానంతో పార్టీ కోసం ఏమీ శించకుండా పనిచేస్తూ వచ్చాను. అయినప్పటికీ పార్టీ ఎన్నడూ నన్ను గుర్తుంచుకోలేదు. 
 
పార్టీ అధికారంలో వున్నప్పుడు ఒకలా... లేనప్పుడు మరోలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదనపడ్డాను. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ వదిలి అమరావతి మకాం మార్చినప్పటికీ గత నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూనే వున్నా. అన్ని వేదికలపై పార్టీకి మద్దతు పలుకుతూ డిబేట్లలో పాల్గొన్నా. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు సరికదా... ఎప్పుడూ వెనక్కి లాగేవారు. 
 
టీడీపి కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా సిన్సియర్‌గా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా... పార్టీ కోసం పనిచేసిన నాలాంటి వాళ్లను పట్టించుకోకపోవడం కలచివేసింది. ఎన్నోసార్లు పార్టీ కోసం సేవ చేసేందుకు ముందుకు వచ్చినా అవమానాలే మిగిలాయి. పైపెచ్చు పార్టీ నేతలు కొందరు నిరుత్సాహపరిచారు. మొత్తంగా పరిణామాలు చూస్తే టీడీపికి నా అవసరం ఎంతమాత్రం లేదని అర్థం చేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు సామెత ఎంతో సముచితం. బాబు గారి గురించి 40 ఏళ్ల ఇండస్ట్రీ గురించి తెలిసిన చాలామంది కరివేపాకు గురించి చెప్తారు. 
 
ఇప్పుడు నా విషయంలోనూ రుజువయ్యింది. దశాబ్దన్నర కాలంపాటు పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాను. వర్కింగ్ ఉమెన్‌గా ఉండటంతోపాటు సాఫ్ట్వేర్ ప్రొఫెనల్‌గా వున్న నేను ఎలా పనిచేశానో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుగారికి బాగా తెలుసు. ప్రస్తుతం నవ్యాంధ్ర నిర్మాణానికి నిఖార్సయిన నాయకుడి అవసరం ఎంతో వుంది. ఒక అడుగు ముందుకు వేసి, మరో అడుగు వెనక్కి వేసే నాయకత్వ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అవసరంలేదు. పక్క రాజకీయ పార్టీల నుంచి లబ్ది పొందాలనే నాయకత్వాన్ని నవ్యాంధ్ర ప్రజలు హర్షించరు. 
 
ఏం చేసామో చెప్పుకోవాల్సిందిపోయి ఇతర పార్టీలను విమర్శించి, తద్వారా ప్రయోజనం పొందాలనుకునే కుసంస్కారాన్ని టీడీపి వదలాలి. ఏపిడి ఇప్పుడు ఓ దృఢమైన నాయకుడు అవసరం ఎంతో వుంది. కేవలం రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల అవసరాలు పరిష్కరించే నాయకుడికే వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్ట కడతారు. కేవలం రాజకీయాలు మాట్లాడి, రాజకీయాలతోనే కాలం గడపాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పక బుద్ధి చెపుతారు. ఇప్పటికైనా రాజకీయం తక్కువ చేసి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని టిపిడి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుగారికి వినమ్రపూర్వకంగా వేడుకుంటున్నాను... ఇట్లు నిమ్మగడ్డ సీతారత్నకుమారి.'' అని ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments