Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు షాకిచ్చిన రెబెల్ ఎమ్మెల్యేలు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (19:08 IST)
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైకాపాకు దిమ్మతిరిగిపోయింది. ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు వారు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. ఫలితంగా ఆమె ఘన విజయం సాధించారు. 
 
టీడీపీకి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు వైకాపా పంచన చేశారు. మిగిలిన 19 ఎమ్మెల్యేల బలంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరపున అనురాధను అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు టీడీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు జిల్లాకు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు వైకాపాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనురాధకు క్రాస్ ఓటింగ్ వేశారు. 
 
ఫలితంగా ఆమె అనూహ్యంగా గెలుపొందారు. అయితే, టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆ ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మరోవైపు అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments