Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనిఫామ్ తీసేసి, తాడేప‌ల్లిలో బులుగు కండువాలు క‌ప్పుకుని మాట్లాడండి...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:16 IST)
ముగ్గురు ఐపీఎస్ అధికారులు, వైసీపీ అధికారుల్లా దిగ‌జారి మాట్లాడ‌డం ఇండియ‌న్ పోలీస్‌ స‌ర్వీస్ హిస్టరీలో బ్లాక్ డే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమ‌ర్శించారు. ఇంత చ‌దువు చ‌దివి, ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ పొంది, ప్రజా ధ‌నం జీతంగా తీసుకుంటూ, వైసీపీ కార్యక‌ర్తల్లా వ్యవ‌హ‌రించడానికి సిగ్గు లేదా? అని ఆయ‌న పోలీసు ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌శ్నించారు. 
 
వైసీపీకి వ‌త్తాసు ప‌లికే మీరు ప‌విత్రమైన యూనిఫామ్ తీసేసి.. తాడేప‌ల్లిలో బులుగు కండువాలు క‌ప్పుకుని మాట్లాడండి. జెడ్‌ ప్లస్ భ‌ద్రత‌లో ఉన్న చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్తున్నాన‌ని జోగి ర‌మేష్ ప్రక‌టించి మ‌రీ గూండాల‌తో దాడిచేస్తే, మీకు స‌మాచారం లేదా? మాపై దాడి జ‌రిగింద‌ని చెప్పుకోవడానికి వ‌చ్చిన టీడీపీ నేత‌లు మీపై దాడి చేశారా? పోలీస్ వ్యవ‌స్థకే మాయ‌నిమ‌చ్చ మీ వ్యవ‌హార శైలి అని లోకేష్ మండిప‌డ్డారు.
 
మాజీ సీఎం ఇంటిపై దాడి చేసిన జోగి ర‌మేష్‌కు కొమ్ముకాసి పోలీసు వ్యవ‌స్థ గౌర‌వాన్నే మంట‌గ‌లిపార‌ని, ఈ ప‌ద్ధ‌తిని పోలీసులు విడ‌నాడాల‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments