Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంత మంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (16:25 IST)
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుంద‌న్నారు.
 
కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేసామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు.
 
జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకి పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారింద‌ని, చింతమనేని అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, ఆయ‌న్ని త‌క్షణమే విడుదల చెయ్యాల‌ని లోకేష్ డిమాండు చేశారు.  
 
వైకాపా కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర  పరిణామాలు ఎదుర్కోక తప్పద‌ని జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments