Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ లీడర్స్ గజ మోసగాళ్లు : టీడీపీ ఎంపీలు

భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే బీజేపీ నేతలను గజ మోసగాళ్లుగా ఆరోపిస్తున్నారు.

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (15:15 IST)
భారతీయ జనతా పార్టీతో ఉన్న స్నేహ బంధాన్ని తెంచుకోవాలన్న నిర్ణయానికి అధికార తెలుగుదేశం పార్టీ దాదాపుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందువల్లే బీజేపీ నేతలను గజ మోసగాళ్లుగా ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, విభజన హామీల పరిష్కారంతో పాటు నిధుల కేటాయింపులో బీజేపీ పూర్తిగా అన్యాయం చేయడాన్ని ఏపీ ప్రజలతో పాటు టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పార్లమెంట్ వేదికగా చేసుకుని నిరసలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. 
 
ఈనేపథ్యంలో తెదేపా ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కేశినేని నాని, సీఎం రమేష్ తదితరులు బీజేపీపై నిప్పులు చెరిగారు. తమ ఆందోళన సభలో కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కంటే బీజేపీ పెద్ద మోసం చేసిందని, వారి కంటే పెద్ద మోసగాళ్లు బీజేపీ నేతలేనని ఆగ్రహించారు. 
 
కాంగ్రెస్ తలుపులు వేసి అన్యాయం చేస్తే, వీళ్లు తలుపులు తెరిచి మోసం చేశారని రాయపాటి ధ్వజమెత్తారు. 'బాహుబలి' చిత్రం సాధించిన కలెక్షన్ల కంటే ఏపీకి తక్కువ ఇచ్చారని గల్లా జయదేవ్ ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments