Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు.. తేల్చేసిన కేంద్రం

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు కడపలో స్ట

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (19:02 IST)
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది.
 
విభజన హామీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది. అయినా మరో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది. 
 
ప్రస్తుతం మెకాన్ సంస్థ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతోందని, ఆ సంస్థ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. మెకాన్ సంస్థ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సమాచారం పంచుకుంటోందని, కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు బయ్యారం వ్యవహారం కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
 
విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే తొలి ఆరు నెలల్లోనే బయ్యారం, కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని తేల్చేసినట్లు కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేగాకుండా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పష్టమైన నివేదిక ఆధారంగా సాధ్యంకాదని తేల్చేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments