Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వేచ్ఛగా నామినేషన్‌ వేయాలి.. భద్రత కల్పించండి: చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (18:55 IST)
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలం సాహ్నికి చంద్రబాబు లేఖ రాశారు.

14వ వార్డు తెదేపా అభ్యర్థి వెంకటేశ్‌పై వైకాపా నేతలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

దాడిలో 30 మంది వరకు పాల్గొని వెంకటేశ్‌పై దాడి చేశారని.. ఈ దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. దాడి చేయడమే కాకుండా నామపత్రాలు చించేసి సెల్‌ ఫోన్ లాక్కున్నారని మండిపడ్డారు.

ఈ దాడికి సంబంధించిన ఫొటోలను ఎస్‌ఈసీకి రాసిన లేఖతో జత చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని.. తెదేపా నేతలు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments