Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడికి సీఎం - డీజీపీలదే బాధ్యత : టీడీపీ

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (16:26 IST)
అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెదేపా అధినేత‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌రిగిన దాడికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి, డీజీపీ గౌతం స‌వాంగ్ బాధ్య‌త వ‌హించాల‌ని కింజార‌పు అచ్చెంనాయుడు అన్నారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ కేశినేని భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో చంద్ర‌బాబుపై జ‌రిగిన దాడిని పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. 
 
తొలుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని రాష్ట్రానికి, దేశానికి‌ చూపించాలనే చంద్రబాబు పర్యటించార‌ని తెలిపారు. ఆ సందర్భంలో కొంతమంది వైసిపి కార్యకర్తలు చంద్రబాబు బస్సు పై చెప్పులు, రాళ్లతో దాడి‌ చేశార‌ని ఈ ఘటనను టిడిపి శాసన సభాపక్షం తీవ్రంగా ఖండిస్తుంద‌న్నారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుపై జరిగిన దాడికి సిఎం జగన్, డిజిపి సవాంగ్‌ బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. 
 
ఘ‌ట‌న అనంత‌రం డిజిపి ప్రకటన‌ చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు ముక్కున వేలేసుకుంటున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. మేము పర్యటన చేస్తే.. మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. మా బస్సుపై పోలీసులు లాఠీ కూడా విసిరారు.. అది ఎవరు వేశారో డిజిపి చెప్పాల‌న్నారు. మంత్రులు చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని, రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారని చెప్ప‌డం బాధాక‌ర‌మ‌న్నారు. 
 
రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే... అన్ని‌చోట్లా దాడి జరగాలి కానీ ఒక్క సెంటర్‌ను‌ ఎంచుకుని అక్కడే దాడి‌ చేయించార‌ని ఆరోపించారు. ఇతర ప్రాంతాలలో మాకు స్వాగతం పలికార‌ని తెలిపారు. భావ స్వేచ్చ అందరికీ ఉంటుంది అని డిజిపి అంటున్నారు. నిరసనకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నాం అన్నారు. రేపటి నుంచి అందరికీ ఇదే విధంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతాం అని హెచ్చ‌రించారు. 
 
వీటికి డిజిపి అనుమతి ఇవ్వకపోతే.. ఆయ‌న్ను వైసిపి కార్యకర్తగా పరిగణిస్తాం అని వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు. టిడిపి ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తే.. త‌మ‌పై ఎందుకు చర్యలు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తాం అన్నారు. 
 
నిమ్మ‌కాయ‌ల చినరాజప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాల‌న‌లో రాజధానిలో ఏం‌  అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఆ ప్రాంతానికి‌, వెళ్లకుండా చూడకుండా మంత్రులు మాట్లాడుతున్నార‌ని చంద్రబాబు పర్యటనలో నిరసన తెలిపే అనుమతి ఇచ్చామని డిజిపి చెప్పడం సరికాద‌న్నారు. తాము చేస్తే మాత్రం సెక్షన్లు పెట్టి మ‌రీ అడ్డుకున్నార‌ని, త‌మ‌కో నిబంధన... అధికార పక్షానికి మరో నిబంధనా అని ప్ర‌శ్నించారు.
 
దాడి జరగకుండా పోలీసులు కంట్రోల్ ఎందుకు చేయలేకపోయార‌ని ప్ర‌శ్నించారు. అమరావతిలో నిర్మాణాలు.. గ్రాఫిక్స్ అని అసత్యాలు ప్రచారం చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. బయటి వ్యక్తులు వచ్చి దాడి చేస్తే.. డిజిపి వారిని సపోర్ట్ చేస్తారా అని ప్ర‌శ్నించారు. సీఎం, డిజిపిలు తీరు మార్చుకుని ప్రజలకు మేలు చేయాల‌న్నారు. జగన్ పాదయాత్రలో తాము పూర్తి భద్రత కల్పించిన విషయాలు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు. 
 
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ డిజిపి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయ‌న్నారు. చంద్రబాబుపై జరిగిన దాడికి ఆయ‌న పూర్తి బాధ్యత వహిస్తారా.. పోలీసులు లాఠీ రౌడీల చేతికి ఎలా వెళ్లింది అని ప్ర‌శ్నించారు. నిరసన తెలిపే హక్కు అందరకీ ఉందని డిజిపి అన్నార‌ని ఈ క్ర‌మంలో సీఎం జగన్ ఇచ్చిన మాట తప్పడంతో ఎంతోమంది ఉద్యోగులు ఆందోళనకు దిగితే ఎందుకు అరెస్టులు చేశార‌న్నారు. త‌మ అధినేతను కలవడానికి త‌మ‌కు సెక్షన్ 30 పెడతారా అని ప్ర‌శ్నించారు. 
 
చంద్రబాబు ముందు నిరసన తెలపడానికి వైసిపి వాళ్లకు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పాల‌న్నారు. జగన్ నివాసానికి బాధలు చెప్పడానికి వస్తే 144సెక్షన్ పేరు చెప్పి అడ్డుకుంది వాస్తవం‌ కాదా అన్నారు. వారందరికీ భావ స్వేచ్చ ప్రకటన వర్తించదా అని పేర్కొన్నారు. జగన్ పర్యటనలో నిరసనలు తెలిపేందుకు త‌మ‌కు కూడా డిజిపి అనుమతివ్వాల‌ని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతకు నిరసన తెలుపుతామంటే త‌మ‌కు ధర్నా చౌక్ చూపించ‌డం దారుణ‌మ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌతం స‌వాంగ్‌ డిజిపినా.. లేక‌ వైసిపికి డిజిపినా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై న్యాయస్థానం ద్వారా  కూడా పోరాడతాం అన్నారు. 
 
పార్టీ సినియ‌ర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని నోరు తెరిచినా కనిపించినా... బూతు తప్ప మరొకటి ఉండద‌న్నారు. ఆయ‌న మాట‌ల‌కు ఇంట్లో ఆడవాళ్లు టీవీలు చూడలేకపోతున్నార‌ని, త‌న స‌తీమణి కూడా నాని భాష టీవీలో చూసి యూజ్ లెస్ ఫెలో అంటూ టివి కట్టేసింద‌ని వ్యాఖ్యానించారు. కనీస సభ్యత, సంస్కారం , ఉచ్చనీచాలు లేని హీనుడు నాని అని దుయ్య‌బ‌ట్టారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు ఆ భాషను తట్టుకుంటారా అని ప్ర‌శ్నించారు. 
 
క్యాబినెట్‌లో మంత్రులు అలా బూతులు తిడుతుంటే సీఎం ఏం చేస్తున్నార‌ని, కనీసం ఖండించడం లేదంటే.. వారిని సీఎం జ‌గ‌నే  ప్రోత్సహిస్తున్నారా అని విమ‌ర్శించారు. కొడాలి నానీకి రాజకీయ భిక్ష పెట్టిన సీనియర్ నాయకుడు చంద్రబాబు అని తండ్రి వయసు ఉన్న వారిని అంత నీచంగా తిడతారా, సరైన తల్లిదండ్రులు పెంపకం ఉంటే అత‌నిలా ఎవ్వరూ మాట్లాడర‌ని వ్యాఖ్యానించారు. పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు స‌క్ర‌మంగా ఉందా అని డిజిపి తర్వాత ఆరుగురు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
ఈ ఘ‌ట‌న అనంత‌రం డిజిపి చేసిన వ్యాఖ్యల‌తో ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు అన్నారు. పర్యటన ఖారారు కాగానే భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది కాదా అన్నారు. నిరసనకు అనుమతిచ్చి.. చెప్పులు, రాళ్లు వేయిస్తారా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి అనుమతి ఇచ్చిందా అని ప్ర‌శ్నించారు. అంగన్‌వాడీ వర్కర్లు, కాంట్రాక్టు సిబ్బంది నిరసన అనగానే అరెస్టు చేశార‌ని గుర్తుచేశారు. డిజిపి ర్యాంకులో ఉన్న ఆ ఆరుగురు త‌న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలను కాపాడటంలో డిజిపి పూర్తిగా విఫలమయ్యార‌ని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లి డిజిపి వ్యవహారశైలిపై ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments