Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలీ బాబా అందరూ దొంగలే.. షర్మిలకు అంత సీన్ లేదు.. జగన్ జైలుకు పోతాడనే?

రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మద్యం దుకాణాలు వైకాపా నేతలకు చెందినవేనని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్‌ వారిని వ్యాపారం మాన్పించాకే ప్రజలకు హామీ ఇవ్వాలని సూచించారు. మద్యం తాగనిదే నిద్రపోని వ

Webdunia
సోమవారం, 10 జులై 2017 (20:07 IST)
రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మద్యం దుకాణాలు వైకాపా నేతలకు చెందినవేనని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్‌ వారిని వ్యాపారం మాన్పించాకే ప్రజలకు హామీ ఇవ్వాలని సూచించారు. మద్యం తాగనిదే నిద్రపోని వ్యక్తులంతా వైకాపాలోనే ఉన్నారని రవీంద్ర విమర్శించారు. నిత్యం మందు తాగే వ్యక్తులు మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందన్నారు.
 
అలాగే సీఎం చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శించే అర్హత షర్మిలకు లేదన్నారు. రాజకీయం చేతగానే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా తెచ్చుకున్నారన్నారు. చంద్రబాబును విమర్శించేందుకే జగన్‌ పార్టీ ప్లీనరీని ఏర్పాటుచేశారని అన్నారు.
 
మరోవైపు.. మంత్రి కె.ఎస్‌.జవహార్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్లీనరీని పరిశీలిస్తే.. ఆలీ బాబా అందరూ దొంగలే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లీనరీలో ప్రశాంత్‌ కిశోర్‌ను పరిచయం చేసి ఆయనే సారథ్యం వహిస్తారని చెప్పడం ద్వారా తాను జైలుకు పోతాను అని ప్రతిపక్షనేత చెప్పకనే చెప్పారన్నారు.  
 
టీడీపీ నేతలే కాకుండా..కాంగ్రెస్ నేతలు కూడా వైకాపా చీఫ్ జగన్‌పై ఫైర్ అవుతున్నారు. పొరపాటున జగన్ సీఎం అయితే కనుక వీధికో రౌడీ తయారవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం కావాలనే కోరిక పగటికలగానే మిగిలిపోతుందన్నారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్.. ఒకవేళ కేసుల నుంచి బయటపడ్డా, ప్రజాకోర్టు నుంచి తప్పించుకోలేరని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments