Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (17:00 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జోరుగా వలసలు సాగుతున్న తరుణంలో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. 
 
దీనిపై ఆరా తీయగా, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రిగా కొనసాగుతున్నారు. అదేసమయంలో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి ఆయన అందజేశారు. 
 
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పలువురు టీడీపీ, వైకాపా నేతలు తమతమ మాతృపార్టీలకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్‌లు రాజీనామా చేయగా, వైకాపా నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు శుక్రవారం రాజీనామాలు చేశారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీల్లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments