Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను నమ్మితే బిర్యానీ కాదు చిప్పకూడు ఖాయం.. పార్టీ భూస్థాపితమే: ఆర్‌.శ్రీనివాసరెడ్డి

పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాకు వచ్చి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి మా తండ్రి పూర్తి చేశారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని.. ఇలాంటి విపక్ష నేత జిల్లా వాసి

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:52 IST)
పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాకు వచ్చి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి మా తండ్రి పూర్తి చేశారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని.. ఇలాంటి విపక్ష నేత జిల్లా వాసి కావడం ప్రజల దౌర్భాగ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నేర పరిశోధన సంస్థలకు దొరికిపోయి ఐఏఎస్‌, ఐపీఎస్‌, పారిశ్రామిక వేత్తలను తనతో పాటు జైలుకు పంపించిన ఘనత జగన్‌దేనని వ్యాఖ్యానించారు. 
 
నీటి పారుదల అభివృద్ధి బోర్డు సమావేశాలకుకానీ, చివరకు జిల్లా పరిషత్‌ సమావేశాలకు కూడా హాజరు కాని జగన్‌ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసునని, ముఖ్యంగా ప్రాజెక్టులకు నీరు ఎవరి ద్వారా వస్తున్నాయో పులివెందుల ప్రజలకు మరింత తెలుసునని చెప్పారు. 
 
సొంత తల్లిపై పోటీ చేసిన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి బిర్యానీ పెడతా... నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానంటూ అమాయకులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వంచించేందుకు జగన్‌ జిల్లాలో పర్యటించారన్నారు. జగన్‌ను నమ్మితే బిర్యాని కాదు కదా జైలు చిప్పకూడు తినిపిస్తారని ఆరోపించారు. బాబు వల్లే పులివెందులకు సాగు నీరు వస్తున్న సంగతి ముమ్మాటికీ వాస్తవమని తెలుసుకున్న ప్రజలు జగన్‌ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments