Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పీఏను తక్షణం తొలగించండి.. చంద్రబాబును కోరిన బాలకృష్ణ

హిందూపురంలో టీడీపీ శ్రేణులను ఓ ఆట ఆడుకుంటున్న పీఏ శేఖర్‌ను తక్షణం తొలగించాలని సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశ

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:41 IST)
హిందూపురంలో టీడీపీ శ్రేణులను ఓ ఆట ఆడుకుంటున్న పీఏ శేఖర్‌ను తక్షణం తొలగించాలని సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా సమావేశమై విజ్ఞప్తి చేశారు. హిందూపురం పార్టీలో తలెత్తిన లుకలుకలకు కారణమైన శేఖర్‌ను ఇక కొనసాగించరాదని, పార్టీలో క్రమశిక్షణను ఎవరు ఉల్లంఘించినా సహించేది లేదని, ఎవరి ఒత్తిళ్ళకూ తలొగ్గరాదని స్పష్టం చేశారు. 
 
కాగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినీ షూటింగ్‌లలో బిజీగా ఉండటంతో స్థానిక రాజకీయ పరిస్థితులను పీఏ శేఖర్ గత రెండున్నరేళ్లుగా చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని, కాంట్రాక్టర్లను బూతులు తిడుతూ బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, పార్టీ నేత అంబికా లక్ష్మీ నారాయణ పార్టీ నాయకత్వ దృష్టికి తెచ్చారు. పైగా, శేఖర్‌ను తొలగించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. 
 
అదేసమయంలో లేపాక్షి, చిలమత్తూరు మండల జెడ్పీటీసీ సభ్యులతో రాజీనామాలు చేయించారు. ఈ వ్యవహారమంతా చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. మంగళవారం ఉదయం విజయవాడలో తనతో బాలకృష్ణ, లోకేష్ సమావేశమైనప్పుడు బాబు... శేఖర్‌ని తక్షణమే తొలగించాలని సూచించారు. అటు నిమ్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య కూడా శేఖర్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఎవరు అతిక్రమించినా సహించే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించిన విషయం గమనార్హం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments