Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ కోవర్టు కేశినేని నాని .. పిట్టల దొర ఎవరో తెలిపోద్దిగా.. :: కేశినేని చిన్ని

వరుణ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (12:07 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి తన అన్న కేశినేని నాని నమ్మక ద్రోహం పేరుతో వెన్నుపోటు పొడిచాడని నాని తమ్ముడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఆరోపించారు. తన అన్న కేశినేని నాన్ని లక్ష్యంగా చేసుకుని కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన చంద్రబాబుకు నాని తీరని ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో కోవర్టులా వ్యవహరించారని, అన్ని విషయాలను జగన్‌కు చేరవేశారని ఆరోపించారు. 
 
కేశినేని చిన్ని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు లోకేశ్ ఎవరెవరిని కలుస్తున్నారు? ఏమేం మాట్లాడుకుంటున్నారన్న విషయాలను జగన్‌కు మా అన్న నాని చేరవేశారని పేర్కొన్నారు. విజయవాడ కోర్టు లోపల జరిగిన పరిణామాలను కూడా ఆయన జగన్‌కు చేరవేశారని, దీంతో పోలీస్ కమిషనర్ టీడీపీ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
 
ఎన్టీఆర్ జిల్లాలో టికెట్లు ఇప్పిస్తానని పలువురి నుంచి నాని కోట్ల రూపాయలు వసూలు చేశారని, వాటిని తిరిగి ఇవ్వకపోతే బాగుండదని హెచ్చరించారు. మైలవరం టికెట్ ఇప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశారని, ప్రాణ స్నేహితుడి వద్ద కూడా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. 
 
విజయవాడ ఎంపీగా టీడీపీలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీలో జగన్ పాలేరుగా మారారని ఎద్దేవా చేశారు. తనను పిట్టల దొర అన్న నాని పరిస్థితి ఏంటో మరో మూడు నెలల్లో తేలిపోతుందని చెప్పారు. వైసీపీ ఆయనకు విజయవాడ సీటు కూడా ఇవ్వదన్నారు. ఎన్నికల తర్వాత కేశినేని నాని అనే వ్యక్తి ప్రజా జీవితంలో ఉండరని జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments