Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్... థూ.. ఇవీ ఓ ఎన్నికలేనా? టీడీపీ నేత జలీల్ ఖాన్

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:15 IST)
ఏపీలో జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల తీరుపై టీడీపీ నేత జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఇవీ ఓ ఎన్నికలేనా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత‌ 32 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి, గత పంచాయితీ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. 
 
ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా తీవ్రవాదంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. ఏకపక్షంగా దౌర్జన్యంగా సిఐలే దగ్గరుండి డబ్బులిచ్చి పంచిస్తున్నారు. ఇలాంటి దారుణం ఎక్కడా చూడలేదు. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా. ఏరోజు పోలింగ్ బూత్‌లోకి వెళ్లలేదు. 
 
పోలీసులంటే సౌమ్యంగా ఉండాలి. కాని రొమ్ము విరిచి మాట్లాడుతున్నారు. నా‌ ఇంటికాడ షాడో పార్టీ పెట్టారు. 
అవినీతిపరుడైన మంత్రి ఇంటి ముందు షాడో పార్టీ పెట్టాలి కాని, నా ఇంటి ముందు ఎందుకు టిడిపి నేతలు ఎక్కడా తిరగకూడదంటా. కాని వైసిపి నేతలు, చిల్లర నేతలు బూత్‌ల వద్ద రౌడీయిజం చేశారు. 
 
వైసిపి నేతలు నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం తక్కువ కావడానికి కారణం పోలీసులే. అధికార పార్టీకి గులాం గా పోలీసులు వ్యవహరించారు. వైసిపి నేతలు ప్రలోభాలకుగురి చేసినా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లో ప్రజలు స్వచ్చందంగా‌ ఓట్లు వేసేందుకు వచ్చారు
 
దుర్గగుడిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినా‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసిపిలో కార్పొరేషన్ లో సీట్లిచ్చిన వారంతా‌ దొంగలు, ‌రౌడీ షీటర్లే చంద్రబాబును విమర్శించే స్ధాయి వెలంపల్లికి లేదు. చంద్రబాబు ఇంట్లో పాచిపని చేసుకొనే వ్యక్తి స్థాయి వెలంపల్లిది. 
 
త్వరలోనే డిజిపి, ఎన్నికల అధికారులను కలుస్తా. వన్టౌన్, కొత్తపేట సిఐలు, ఎసిపిని మార్చాలని కోరతా. పోలీసు వ్యవస్ధ సీరియస్‌గా‌ ఉంటే వైసిపి ఖతం అవుతుంది. పోలీసులు సాదాసీదాగా ఉండడం వలనే ప్రభుత్వం ఇంకా ఉంది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను టిడిపి కైవసం చేసుకోవడం ఖాయం అని జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments