Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో..: వర్మకు దివ్వవాణి కౌంటర్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినీ నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి గట్టి కౌంటర్ ఇచ్చారు. తగువులు పెట్టందే తాగిన ఓడ్కా మత్తు దిగదేమో అంటూ విమర్శించారు. పైగా, వర్మను పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
 
తెలుగుదేశం పార్టీ పగ్గాలను హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెప్పాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై దివ్యవాణి ఘాటుగా స్పందించారు. 
 
'నారా లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా, నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డిలాగ 420 పనులేవీ చేయెట్లా. నీకు పేటీఎం అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్‌గారు ఎప్పుడో చెప్పారు. 
 
టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్‌గారికి తెలుసు. నారదుడిలాగ ఎప్పుడూ ఎవరికో ఒకరికి తగువులు పెట్టంది నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో. ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త' అంటూ దివ్యవాణి ఆర్జీవీపై చెలరేగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments