Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను చంపి నా సరే.. ప్రశ్నిస్తూనే ఉంటా.. దేవినేని ఉమ

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:28 IST)
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. 
 
కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నాడు. 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నామీద తప్పుడు కేసులు పెట్టి.. నా గొంతు నొక్కలేరు. 
 
హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది. నన్ను రాజమండ్రి జైలులో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments