Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు : సీఎం జగన్‌కు టీడీపీ నేత అనగాని లేఖ

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేష‌న్ నిధుల మ‌ళ్లింపుపై ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ బ‌హిరంగ లేఖ‌ రాశారు. గ‌త రెండేళ్లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌పై తీవ్ర నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
నిధుల మ‌ళ్లింపు ప‌థ‌కంతో బీసీల‌కు న‌య‌వంచ‌న‌ చేస్తోందని, బీసీలను ఉద్దరించేశామంటూ మోసం, దగా చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల‌లో బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.18,050 కోట్లు మళ్లించారన్నారు. బీసీల నిధుల మ‌ళ్లింపు గురించి ఎందుకు మాట్లాడ‌డం లేదని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.
 
అంతేకాకుండా, 2019-20లో రూ.15 వేల కోట్లు కేటాయించి రూ.10,478 కోట్లు మళ్లించారని, 2020-21లో రూ.23 వేల కోట్లు, 2021-22లో రూ.25 వేల కోట్లు మ‌ళ్లించారని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. బీసీ కార్పొర‌ష‌న్ నుంచి రెండేళ్ల‌లో ఒక్క రుణ‌మూ ఇవ్వ‌క‌పోవ‌డం వాస్త‌వం కాదా? అని ప్రశ్నించారు. 
 
45 వేల కాపు కార్పొరేష‌న్ రుణాలు ర‌ద్దు చేయ‌డం వాస్త‌వం కాదా అని నిలదీశారు. కార్పొరేష‌న్, ఫెడ‌రేష‌న్, స‌బ్ ప్లాన్‌ల‌ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. టీడీపీ హాయంలో బీసీల‌ను య‌జ‌మానులుగా చేస్తే.. ఇప్పడు సీఎం జగన్ బిచ్చ‌గాళ్లుగా మార్చారని అనగాని స‌త్య‌ప్ర‌సాద్ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments