Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం : ఇండియా టుడే సర్వే

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (16:26 IST)
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరుతో ప్రముఖ పత్రిక ఇండియా టుడే ఓ సర్వేను నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారా? లేదా విపక్షాల కూటమి బీజేపీ జోరుకు బ్రేక్ వేస్తుందా? అనే అంశాలతో పాటు అత్యంత కీలకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 
 
గురువారం వెల్లడైన ఈ సర్వే ఫలితాల మేరకు... ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ సీట్లలో టీడీపీ ఏకంగా 17 సీట్లను, వైకాపా 8 సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసింది. అలాగే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 45 శాతం ఓట్లు, వైకాపాకు 41.1 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం, కాంగ్రెస్ పార్టీకి 2.7 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాన్ని మాత్రం ఈ సర్వే బహిర్గతం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments