Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 3న టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:28 IST)
నవంబరు 3న తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఈ భవన నిర్మాణం జరుగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయాన్ని నవంబరు 3న ప్రారంభించనున్నారు.

రాత్రి 7గంటల.19 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. తెదేపా కార్యాలయ అవసరాల కోసం మొత్తం మూడు భవనాలు నిర్మిస్తున్నారు. ఒక భవనాన్ని మొదట పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నారు.ఈ భవనాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ కార్యకలాపాల్ని పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహించనున్నారు.

కొత్త కార్యాలయం సిద్ధమయ్యేంత వరకు ప్రస్తుతం గుంటూరు నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. తెదేపా కేంద్ర కార్యాలయ భవనాల మొత్తం నిర్మిత ప్రాంతం 2.5 లక్షల చదరపు అడుగులు కాగా...,మొదటి భవనం నిర్మితప్రాంతం 75 వేల చ . అడుగులు . దాన్ని జీ + 3 విధానంలో నిర్మిస్తున్నారు.

ఈ భవనం మూడో అంతస్తులో చంద్రబాబు , లోకేశ్ చాంబర్లతో పాటు పొలిట్ బ్యూరో సమావేశ మందిరం ఉండానున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చాంబర్ మొదటి అంతస్తులో ఉంటుంది . రెండో అంతస్తులో నాలెడ్జ్ సెంటర్, సమాచార కేంద్రం వంటివి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments