Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీబీ అదుపులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు... రహస్య ప్రదేశంలో...

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (08:39 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని ఏపీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తర్వాత ఆయనను ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. 
 
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలపై గతంలో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించగా.. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉండడంతో ఆయనను, మరి కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
 
అచ్చెన్నాయుడు నిమ్మాడలో ఉన్నట్టు తెలుసుకున్న ఏసీబీ అధికారులు గురువారం అర్థరాత్రి నిమ్మాడకు వంద మందికిపైగా పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. 
 
టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ చేయించాలని నిర్ణయంచింది. ఇదేసమయంలో ఏపీలో ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. వీటిపై కూడా జగన్ సర్కారు దృష్టిసారించింది. ఇందులోభాగంగానే అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుంది. 
 
నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని, టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని.. నామినేషన్ల పద్ధతిలో టెండర్లు కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆరోపిస్తున్నారు. దీంతో అచ్చెన్నాయుడు హస్తం ఉందని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది.. (video)

Ramcharan, Allu arjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments