Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిని చంపేశారు.. రివర్స్ టెండరింగ్ అంటూ.. రివర్స్‌లో వెళ్తున్నారు: చంద్రబాబు ఫైర్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (14:20 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రాన్ని రివర్స్‌లోకి తీసుకెళ్తున్నారంటూ విమర్శించారు. 
 
గురువారం కాకినాడలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం స్వీకారం చేసిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అరాచకాలు ఆరంభమయ్యాయని ఆరోపించారు. 
 
ఏ కొత్త ప్రభుత్వమైనా తొలి వంద రోజుల్లో ఒక దశాదిశను ఏర్పాటు చేసుకుంటుందని... వైసీపీ ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో ప్రజల్లో అప్రతిష్టపాలైందన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతిన చంపేసే స్థితికి తెచ్చారని అన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్‌తో ముందుకు వెళ్లే ప్రాజెక్టును దెబ్బతీశారని చెప్పారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు, దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాడులు జరగడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని చెప్పారు. సొంత బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డిని సొంత ఇంట్లోనే చంపినప్పటికీ.. ఈ హత్యకు పాల్పడిన హంతకులను ఇప్పటివరకు పట్టుకోలేక పోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments