Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు.. అచ్చెన్న

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (08:34 IST)
రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడెపుడు వస్తాయా.. అపుడు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. 
 
అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో మేకపాటి కుటుంబం నుంచి కాకుండా వేరే అభ్యర్థిని వైకాపా పోటీలో ఉంచితే తెదేపా సత్తా చూపేవాళ్లమన్నారు. 
 
సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవిలో ఉండగా మరణిస్తే.. ఆ స్థానాలకు జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని తెదేపా పాటిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
"మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబీకులు ఉప ఎన్నికల్లో నిలబడితే.. ఆ ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. ఈ అంశంపై తమ విధానమేంటో వైకాపా స్పష్టం చేయాలి. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి ఆత్మకూరు సీటు కేటాయిస్తే.. తెదేపా తప్పక పోటీలో నిలబడేది. మా సత్తా ఎంతో చూపేవాళ్లం" అని అన్నారు.
 
పైగా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా వైకాపాను బంగాళాఖాతంలో విసిరేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైకాపా వాళ్లు అనవసర సవాళ్లు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి అని వైకాపా పాలకులకు అచ్చెన్నాయుడు హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments