Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అరెస్ట్‌పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు.. పవన్‌ సీరియస్

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (23:31 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనంతరం టీడీపీ న్యాయవాదుల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. అంతేగాకుండా బాబు అరెస్ట్‌పై ఆ పార్టీ వర్గాలు న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. 
 
అలాగే విజయవాడ చేరిన టీడీపీ న్యాయవాదుల బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా ఉన్నారు. రాత్రి 11 గంటల  సమయంలో న్యాయమూర్తి నివాసానికి వెళ్లిన న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ అందజేశారు. 
 
చంద్రబాబును అరెస్ట్ చేసి చాలా సమయం అయిందని టీడీపీ న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. వయసు, ఆరోగ్య రీత్యా అరెస్ట్ చేసిన 24 గంటల్లో చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. 
 
మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. గరికపాడు వద్ద పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల నుంచి ఆటంకం ఎదురుకావడంతో వాహనం దిగి కాలినడకన మంగళగిరి బయల్దేరారు. 
 
అయినప్పటికీ పోలీసులు పవన్‌ను అడ్డుకున్నారు. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నంచడంతో పవన్ రోడ్డుపై పడుకున్నారు. పవన్‌ను తిరిగి హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments