Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తలకెక్కిన తారాచౌదరి.. పామూరు ఎస్ఐతో పెట్టుకుంది...

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (10:29 IST)
తారాచౌదరి. ఈ పేరు తెలియని వారుండరు. ఒకపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. పలువురు పెద్ద రాజకీయ నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు, సినీ సెలెబ్రిటీకు అమ్మాయిలను సరఫరా చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తారాచౌదరి పేరు మీడియాలో మార్మోగిపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగిపోయింది. దీంతో ఆమె పేరు కూడా మీడియాలో ఎక్కడా వినిపించలేదు.
 
ఈ నేపథ్యంలో తాజాగా తారాచౌదరి పేరు వార్తలకెక్కింది. దీనికి కారణం... తన భర్తను పామూరు ఎస్ఐ అకారణంగా కొట్టారంటూ ఆమె మీడియా ముందుకు వచ్చింది. నిత్యావసర సరుకులు, ఐదు నెలల తన బిడ్డకు మందులు తీసుకువచ్చేందుకు ఉదయం 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను పామూరు ఎస్ఐ చంద్రశేఖర్ అకారణంగా కొట్టి నాటుసారా అక్రమ రవాణా కేసును పెట్టారని ఆరోపించింది. 
 
ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తనను కూడా బొక్కలో వేస్తానని బెదిరించాడని వాపోయింది. తన భర్త రాజ్‌కుమార్‌పై పామూరు ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ కావాలనే కక్ష పూరితంగా దాడి చేశారని, టార్గెట్ చేసి నాటు సారా తరలిస్తున్నట్లు, తాగినట్లు బ్రీతింగ్ టెస్ట్ సీన్ క్రియెట్ చేసి కేసు నమోదు చేశాడని ఆమె ఆరోపించింది. 
 
లాక్‌డౌన్ సమయంలో తన సమస్యలు, ప్రజల ఇబ్బందులు ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లటమే దీని అంతటికి కారణమన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కావాలనే తన భర్త రాజ్ కుమార్ బయట తిరుగుతున్న క్రమంలో టార్గెట్ చేసి కేసు పెట్టారని తారా చౌదరి ఆరోపించారు. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తారా చౌదరి వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments