Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' సినిమా చూశాడు... బస్సును హైజాక్ చేసిన దొంగ.. (Video)

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (09:11 IST)
హీరో అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం "పుష్ప-2". ఈ నెల 5వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను స్ఫూర్తిగా తీసుకున్న ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును హైజాక్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాధిక్ అనే వ్యక్తి ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి 'పుష్ప-2' చూసి బస్టాండులోని బస్సులోనే నిద్రించాడు. అయితే, బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరుకు వరకు నడుపుకుంటూ వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన ఆపి మళ్లీ నిద్రపోయాడు. 
 
అయితే, బస్సు కనిపించకపోవడాన్ని గమనించిన బస్సు సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. హైజాక్ చేసిన బస్సు చింతలూరు వద్ద ఉన్నట్లు సమాచారం అందుకుని, అక్కడకు చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బస్సులో గుర్రుపెట్టి నిద్రపోతున్న దొంగను కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments