Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ప్రజల దాహార్తిని తీర్చండి... సీఎం జగన్ ఆదేశం

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (14:46 IST)
తాగు నీటి కోసం అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని తమిళనాడు మంత్రుల బృందం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. తాగడానికి నీళ్లు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని వారు ఈ సందర్భంగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
చెన్నైలో నీటి కష్టాలను సీఎంకు తమిళనాడు మంత్రుల బృందం వివరించింది. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని వారు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్‌.జగన్‌ వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించిటనట్టు సమాచారం. 
 
ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని, ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలనీ, అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 
అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆయన అధికారులను ఆదేశించారు. 
 
చెన్నైకి తాగునీటి జలాలు ఇస్తన్నందుకు తమిళనాడు మంత్రుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. చెన్నైలోని 90 లక్షల మంది ప్రజల ఆశీస్సులు సీఎం వైయస్‌.జగన్‌కు ఉంటాయన్న తమిళనాడు మంత్రుల బృందం... తాము అడగ్గానే మానవత్వంతో స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
కాగా, సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రుల బృందంలో తమిళనాడు మున్సిపల్‌ శాఖమంత్రి వేలుమణి, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖమంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌‌ తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments