Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి బస్టాండ్‌లో గంటలపాటు అలాగే కూర్చున్న యువతి, పోలీసులకు అనుమానం వచ్చి అడిగితే...

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (21:56 IST)
ఇంట్లో అమ్మా, నాన్న మాట్లాడడం సహజమే. పిల్లలు పెడదారి పడుతుంటే దండిస్తూ ఉంటారు. అయితే ఒక వయస్సు వచ్చిన తరువాత తల్లిదండ్రులు తిడితే మాత్రం పిల్లలు ఒప్పుకోరు. అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం సేలంలో జరిగింది. తల్లి మందలించిందన్న కోపంతో ఇంటి నుంచి వచ్చేసిన యువతి తిరుపతి బస్టాండ్‌లో ప్రత్యక్షమైంది. ఒకే చోట చాలాసేపు కూర్చుని ఉండటంతో పోలీసులు గుర్తించి విచారిస్తే అసలు విషయాలు బయటకు వచ్చాయి.

 
తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన 25 యేళ్ళ యువతి హాసిని బెంగుళూరులో ఉంటోంది. ఉద్యోగ వేటలో బెంగుళూరులో ఫ్రెండ్స్‌తో పాటు ఉండేది. రెండు నెలలుగా అక్కడే ఉన్న హాసిని మూడురోజుల క్రితమే ఇంటికి వచ్చింది. ఇంకా జాబ్ దొరకలేదని తల్లికి చెప్పింది. ఇంట్లో ఉన్న రెండురోజులు సెల్ ఫోన్‌కు అతుక్కుని పోయి ఏ పనిచేయపోవడంతో అమ్మకు కోపమొచ్చింది.

 
దీంతో హాసిని తల్లి సుందరి మందలించింది. ఇలా ఉంటే ఉద్యోగం ఏం చేస్తావు అంటూ గట్టిగా తిట్టింది. దీంతో హాసిని మనస్థాపానిక గురైంది. ఫ్రెండ్ ఇంటి వరకు వెళ్ళొస్తానని చెప్పి నేరుగా తిరుపతి బస్సు ఎక్కింది.

 
తిరుపతి బస్టాండ్‌కు చేరుకున్న యువతి సుమారు మూడుగంటల పాటు బస్టాండ్ లోపలే ఉన్న ఛైర్ లోనే కూర్చుని ఉంది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను విచారించారు. దిశ పోలీసు స్టేషన్‌కు పంపించారు. తన తల్లి తిట్టిందని అందుకే ఇంటి నుంచి వచ్చేశానని చెప్పింది. దీంతో దిశ మహిళా పోలీసులు హాసిని తల్లిదండ్రులకు సమాచారాన్ని తెలిపి తిరుపతికి పిలిపించి యువతిని అప్పగించారు. హాసినికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments