Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది : సురేష్ ప్రభు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (21:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, బీజేపీ భ్యుడు సురేష్ ప్రభు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందని వ్యాఖ్యానించారు. పైగా, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, చేయిదాటక ముందే చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ మేరకు విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో.. దేశంలోని పలు రాష్ట్రాలు అప్పులు చేయడం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులు పరిధిని దాటి పోయాయని చెప్పారు. ఈ అప్పులను సంక్షేమ పథకాలకు తరలిస్తున్నారని తెలిపారు. 
 
అభివృద్ధి పథకాలకు వాడాల్సిన నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తే... అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయిదాటి దిగజారక ముందే చర్యలు తీసుకోవాలని కోరారు. సురేశ్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments