Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ9 రవిప్రకాష్‌కు సుప్రీంలో చుక్కెదురు : ఏ క్షణమైనా అరెస్టు??

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (16:19 IST)
టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పైగా, 41ఏ సెక్షన్ కింద విచారణకు హాజరుకావాల్సిందేనంటూ తేటతెల్లం చేసింది.
 
ఫోర్జరీ, డేటా చోరీ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ విచారణకు రావాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
అదేసమయంలో ఆయనకు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, దాన్ని హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
సుప్రీంకోర్టులో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అదేసమయంలో 41ఏ సెక్షన్ కింద విచారణకు హాజరుకావాల్సిందేనంటూ స్పష్టంచేసింది. అయితే, అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. 
 
దీంతో రవిప్రకాష్‌కు ముందున్న అన్నిదారులు మూసుకునిపోయాయి. ఫలితంగా ఆయన్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments