Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై సుప్రీం విచారణ వాయిదా

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (16:01 IST)
ఫైబర్ నెట్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచాణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ముందు 17ఏ పై వాదనలు ముగిద్దామని, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కూడా అంగీకరించడంతో శుక్రవారానికి వాయిదా వేశారు.
 
మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంటు కేసును కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు తరపున దాఖలైన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరుగుతున్నాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేస్తుందా లేదా తీర్పును వెల్లడిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఇదిలావుంటే, ఫైబర్ నెట్ కేసును మరోరోజు చూద్ధాం అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ముందు క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిద్దాం అని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసు విచాణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంటూ ఆ మేరకు ఆదేశాలు ఇస్తామన్నారు. 
 
అందుకు చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా స్పందిస్తూ, ఈ కేుసలో కోర్టు విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను కూడా పొడగిస్తున్నట్టే కదాఅని ధర్మాసనం నుంచి మరింత స్పష్టత కోరారు. అందుకు న్యాయమూర్తి బోస్ స్పందిస్తూ, అవును. అది కూడా పొడగిస్తున్నట్టే అని స్పష్టం చేశారు. ఈ విచారణ ముగిసేంత వరకు ఫైబర్ నెట్ కేసులో అరెస్టు చేయొద్దని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments