Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ చీఫ్ చంద్రబాబును కలిసిన సూపర్ స్టార్ రజనీకాంత్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (11:28 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "జైలర్". ఈ చిత్రం షూటింగ్ కోసం ఆయన భాగ్యనగరికి చేరుకున్నారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో రజనీకాంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. కేవలం మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలుసుకున్నట్టు రజనీ సన్నిహిత వర్గాల సమాచారం. 
 
పైగా, రజనీని కలుసుకున్న విషయాన్ని చంద్రబాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తన మిత్రుడు తలైవాను కలవడం ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
అయితే, ఈ భేటీపై పలు రకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే యేడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైపోయింది. అయితే, బీజేపీని కూడా తమతో చేర్చుకునేందుకు లోపల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న రజనీకాంత్ ద్వారా టీడీపీ - జనసేన - బీజేపీలు కలిసి పోటీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments