Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాతో చెలిమి... సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దల షాక్

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (15:27 IST)
ఏపీలోని అధికార వైకాపా నేతలతో అంటకాగినందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దేవ్‌ధర్‌కు బీజేపీ పెద్దలు తేరుకోలేని షాకిచ్చారు. ఇన్‍చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఐదేళ్లుగా పార్టీపరంగా ఏపీకి అందించిన సేవలు చాలంటూ ఉద్వాసన పలికింది. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా తన బృందంలో సునీల్‌కు చోటివ్వలేదు. 
 
మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవ్‌ధర్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్ షా ఆయనను నియమించారు. 2018, జూలై 30న రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా నియమిచారు. అయితే ఏపీలో సునీల్ సేవలు ఆది నుంచి వివాదాస్పదంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో దేవ్‌ధర్ పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపించాయి. 
 
ముఖ్యంగా మీడియా ముందు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెలిమి చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న వై.సత్యకుమార్ను అదేస్థానంలో కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments