Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు.. వామ్మో వడగాలులు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (08:22 IST)
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఒక వైపు కరోనా మరో వైపు ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే దీనికి తోడు వడగాలులు జతయాయ్యాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులు ప్రజలను భయపెడుతున్నాయి.

సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. దీంతో వాతావరణ కేంద్రం అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. మూడు రోజులు ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
 
అత్యవసరం అయితే తప్ప ఎండలో తిరగకపోవడమే మంచిదన్నారు. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలన్నారు.

దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి బొండాలు, నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments