Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండుతున్న ఎండలు.. పొంగుతున్న బీర్లు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (11:34 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు తోచిన చిట్కాలు పాటిస్తున్నారు. మందుబాబులు మాత్రం చల్లటి బీర్లను సేవిస్తూ హాయిగా ఉపశమనం పొందుతున్నారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ చల్లచల్లని బీరువైపు మొగ్గుతున్నారు. దీంతో రాష్ట్రంలో లిక్కర్‌తో పోటాపోటీగా బీరు అమ్మకాలు సాగుతున్నాయి. 
 
సాధారణంగా లిక్కర్‌తో పోలిస్తే బీరు అమ్మకాలు మూడో వంతే ఉంటాయి. రాష్ట్రంలో రోజుకు సగటున లక్ష కేసుల లిక్కర్‌ అమ్మితే, 30 వేల కేసుల బీరు అమ్ముతారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో అందుకు తగినట్టుగా బీరు అమ్మకాలు ఊపందుకున్నాయి. గత నెల 30న రాష్ట్రంలో 90 వేల కేసుల లిక్కర్‌ అమ్మితే, 80 వేల కేసుల బీరు అమ్ముడైంది. 
 
అలాగే 31వ తేదీన 95 వేల కేసుల లిక్కర్‌, 85 వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. ఇక ఈ నెల 3న 62 వేల కేసుల లిక్కర్‌ అమ్మితే, అంతకుమించి 68 వేల కేసుల బీరు అమ్ముడైంది. సాధారణంగా ఏపీలో బీరుకు డిమాండ్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఎండలు తీవ్రంగా ఉన్నా మందుబాబులు ఎక్కువగా లిక్కర్‌కే మొగ్గుచూపుతారు. 
 
కానీ ఈ సంవత్సరం విచిత్రంగా లిక్కర్‌ అమ్మకాలను దాటి బీరు విక్రయాలు జోరందుకున్నాయి. కాగా గతంలో ఉన్న పాపులర్‌ బ్రాండ్ల బీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేవు. ముఖ్యంగా కింగ్‌ఫిషర్‌, నాకౌట్‌, బడ్వైజర్‌ వంటి బ్రాండ్ల బీర్లు అక్కడక్కడా మినహా ఎక్కువ షాపుల్లో అందుబాటులో ఉండటం లేదు. 
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా తెరపైకి వచ్చిన బూమ్‌ బూమ్‌, బీరా, బ్లాక్‌ బస్టర్‌ లాంటి కొత్త బ్రాండ్లే షాపుల్లో ఉంటున్నాయి. అయినా  వినియోగదారులు వేరే దారిలేక వాటినే కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే బీర్లు ధరలు కూడా బాగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఒక్కో బీరు ధర రూ.100 నుంచి రూ.120 ఉంటే.. ఇప్పుడు కనీసం రూ.220కు చేరింది. 
 
ఆ స్థాయిలో ధరలు పెరిగినా ఎండల్లో లిక్కర్‌ తాగలేక వినియోగదారులు బీరుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతోంది. సాధారణంగా లిక్కర్‌ కంటే బీరు ఎక్కువ మోతాదులో తాగుతారు. దీనివల్ల వేసవిలో మద్యం అమ్మకాలు పెరిగి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments