దేశంలోనే అత్యధికసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో మొట్టికాయలు వేసుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమేనన్నారు ఎంపి సుజనాచౌదరి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో తిరుపతిలో సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. గెలిచిన 21 మంది ఎంపిలతో రెండేళ్లుగా వైసిపి చేసిందేమిటని ప్రశ్నించారు. కనీసం వారికి వచ్చే నిధులు సక్రమంగా వాడలేదన్నారు.
బిజెపి అభ్యర్థి రత్నప్రభ గెలుపుతో అభివృద్థి జరుగుతుందని.. కేంద్రం నుంచి నిధులను ఎపికి త్వరగా తీసుకువస్తారన్నారు. అభివృద్థి చేయకుండా పప్పులు, బెల్లాలు పంచుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వైసిపి ఎమ్మెల్యేల తీరుతో విదేశీ సంస్ధలు మొత్తం భయంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదన్నారు.
బిజెపిని గెలిపిస్తే తిరుపతి ఎంతో అభివృద్థి అవుతుందన్నారు. విభజన చట్టంలో ఉన్నది.. లేనిది కూడా బిజెపి ఎపికి ఇచ్చిందన్నారు. చట్టంలో అసలు హోదా అనేది ఎక్కడా పెట్టలేదన్నారు. హోదా కంటే ప్యాకేజీ తోనే ఎక్కువ నిధులు వస్తాయన్నారు.